ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా రెమ్యూనరేషన్ రూపంలో శోభ శెట్టి రూ. 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ గా పొందిందని సమాచారం. ఇదిలా ఉంటే అదనంగా ఆమెకు నాగార్జున ఒక విలువైన బహుమతి ఇచ్చాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులో వచ్చింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు హోస్ట్ నాగార్జున నుంచి వచ్చిన అద్భుతమైన గిఫ్ట్ గురించి అభిమానులతో షేర్ చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శోభాశెట్టి.. నాగార్జునను ఒక కోరిక కోరింది.
ఓ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న డిజైనర్ స్వెట్ షర్ట్ కావాలని అడిగింది.శోభాశెట్టి అడిగేసరికి నాగార్జున కూడా నో చెప్పలేకపోయారు. ఓకే ఈ షర్ట్ నీకే అంటూ మాటిచ్చారు. ఇప్పుడు ఆ షర్ట్ వేసుకుని శోభా ఒక వీడియో రిలీజ్ చేసింది. నాగార్జున గారు ఇచ్చిన గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చింది. “ఈ మమొరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్యూ నాగ్ సార్. లవ్ యూ ఫరెవర్” అంటూ చెప్పుకొచ్చింది. ఆ స్వెట్ షర్ట్ లో ఫొటో షూట్ కూడా చేసింది. ప్రస్తుతం శోభాశెట్టి వీడియో వైరల్ అవుతోంది.
అయితే కొంత మంది ఆ షర్ట్ ధర గురించి కూడా కామెంట్స్ పెడుతున్నారు. కచ్చితంగా వేలల్లో ఉంటుంది అంటున్నారు. అయితే సాధారణంగా బిగ్ బాస్ లో నాగార్జున వేసుకునే షర్ట్స్ ధర ఒక్కొక్కటి కనీసం లక్ష రూపాయలు ఉంటాయి. అలాంటిది శోభాకి ఇచ్చిన స్వెట్ షర్ట్ స్పెషల్ గా డిజైన్ చేసినట్లు ఉంది. ఆ స్వెట్ షర్ట్ ధర కూడా కచ్చితంగా అక్షరాలా రూ.లక్ష ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.