పూర్వకాలంలో మనిషికి ఒక నియమబద్ధమైన ప్రవృత్తి అనేది ఉండేది. దానివల్ల వాళ్ళు ఏది చేసినా ఫలిస్తుందని నమ్మకం ఉండేది. ముఖ్యంగా ఏదైనా మంత్రం ఫలించాలంటే నీకు నీతి, నియమం అనేది తప్పకుండా ఉండాలి.ఇందులో ముఖ్యంగా ఓంకారం. నిత్యం ఓంకారం చేస్తూ ఏ దురలవాట్లు లేని వారికి ముఖంలో ఒక వెలుగు వస్తుంది.
ముఖ్యంగా ప్రాణ యానం, యోగా చేసే వాళ్ళు చాలా బ్రైట్ గా కనిపిస్తారు. అలా ఓంకారం చేయటం వలన వీళ్ళకు ఒక బ్రైట్నెస్ అనేది, శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. దీని ద్వారా వారి ముఖం చూస్తే వారు ఏది చెప్పినా నమ్మాలని అనిపిస్తుంది. వారికి వాక్సిద్ది కలుగుతుంది కాబట్టి వారు ఒక మంచి మాట చెబుతారు. అది అందరికీ ఫలిస్తుంది. అయితే వశీకరణ చేసే వారు కానీ మందు పెట్టే వారు కానీ శుద్ధి కరణ కలిగినవారు ఎవరు ఉంటారు.
పైగా లోక ఉపకారం కోసం చేసేది ఏదైనా సరే ఫలితాన్నిస్తుంది. ఇవి కాకుండా ఎవరినైనా నాశనం చేస్తే మాత్రం ఫలితం రాదు. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. మరుగు మందు పెట్టారని, దానివల్ల ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడని, దాన్ని మళ్లీ కక్కించాలనే విషయాలను గమనిస్తూ ఉంటాం. దీనివల్ల ఏమి లాభం ఉండదు.