అతిథి సినిమా నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ శర్మ తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మామయ్య పాత్రలు, తండ్రి పాత్రలతో ఎంతో ఫేమస్ అయ్యారు. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ బిజీగా ఉన్న నటుడు ఎవరంటే మురళి శర్మ అని చెప్పొచ్చు. గత కొన్నాళ్లుగా ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదట్లో కేవలం విలన్ పాత్రలు పోషించిన ఆయన.. ఇప్పుడు ఎక్కువగా తండ్రి పాత్రలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి మెప్పించారు.
వెండితెరపై అన్ని రకాల పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కొన్ని చిత్రాలతో ఆయన పాత్రలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న రావు రామేశ్ లాంటి నటులకు గట్టిపోటీనిచ్చారు. అయితే మురళి శర్మ అంతకు ముందు హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. అయితే మురళి శర్మ ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్ పై నటుడిగా ముఖ పరిచయం మాత్రమే కానీ. ఆయన గురించి ఎక్కువగా పరిచయం లేదు. ఆయన కుటుంబం, భార్య, పిల్లల గురించి చాలావరకు తెలియదు. బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న మురళి శర్మ తెలుగు నటుడే.
కానీ ఎక్కువగా హిందీలోనే నటించారు. ఇక ఆయన భార్య పేరు అశ్విని కాలశేఖర్. ఆమె కూడా బిజీ ఆర్టిస్ట్. హిందీలో అనేక సీరియల్స్, మూవీస్ చేశారు. సీఐడీ సీరియల్ ద్వారా ఇటు తెలుగు అడియన్స్ కు పరిచయమయ్యారు. అశ్విని కాలశేఖర్ అంటే గుర్తుపట్టడం కష్టమే. కానీ బద్రినాథ్ సినిమాలోని “నేనేవరో తెలుసా.. నీ మేనత్తను.. ఈ రాష్ట్రాన్ని పాలించే సర్కార్ భార్యను. ఒక్కసారి అత్త పిలవ్వే” అనే డైలాగ్ వింటే మాత్రం ఆ నటిని ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో తమన్నా మేనత్త పాత్రలో నటించి అలరించారు. ఆ తర్వాత రవితేజ నటించిన నిప్పు సినిమాలోనూ నటించారు. తెలుగులో ఆమె చివరిసారిగా మెహబూబ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత మరో తెలుగు మూవీలో నటించలేదు. ప్రస్తుతం ఆమె హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.