ఉదయ్ కిరణ్‌ చనిపోవడానికి కారణం ఆ డాక్టరే..! మొత్తం బయట పెట్టిన మురళి మోహన్.

తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈ యంగ్ హీరో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో శేకింగ్ శేషు దానిపై స్పదించారు. ‘గతంలో హీరో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చావుకు అవకాశాలు ఇవ్వని వాళ్లే కారణం’ అంటూ సంచలన వ్యాఖ్యలనే చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్‌..

ఉదయ్‌ కిరణ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ దివంగత నటుడి జీవితంలో ఏం జరిగింది అని యాంకర్‌ ప్రశ్నించగా.. మురళి మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘ఉదయ్‌ కిరణ్‌కి హైపర్‌ టెన్షన్‌ సమస్య. విపరీతమైన బీపీ తరహాలో టెన్షన్‌ పడేవాడు. నన్ను తరచుగా కలుస్తూ ఉండేవాడు. అతడి సమస్య గురించి తెలుసుకుని ఓ డాక్టర్‌ దగ్గర జాయిన్‌ చేశాం. బీపీ వచ్చినప్పుడు మనిషి కంట్రోల్‌లో ఉండటం కూడా కష్టం. దీన్నుంచి బయటపడటానికి ఉదయ్‌ కిరణ్‌కు ట్రీట్‌మెంట్‌ అవసరమని భావించాం.

అందుకే డాక్టర్‌ దగ్గర చేర్చాం’’ అని చెప్పుకొచ్చారు. ‘ఆ డాక్టర్‌ కూడా ఉదయ్‌ కిరణ్‌ని సొంత తమ్ముడిగా భావించి.. చికిత్స మొదలు పెట్టింది. అన్ని జాగ్రత్తలు చెప్పేంది. ఆవేశం తగ్గించుకోవాలి అని సూచించింది. అందుకు ఉదయ్‌ కిరణ్‌ కూడా అంగీకరించాడు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం.. ఆవేశపడిపోయేవాడు. తన సమస్యను కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు’’ అన్నారు మురళి మోహన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *