తండ్రీకూతుళ్ల బంధమంటే ఎంతో పవిత్రంగా భావిస్తాం.. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. మంచి సంబంధం చూసి పెళ్లి చేసే వరకు కూతురిని కనుపాపలా కాచుకుంటాడు తండ్రి. అయితే బంగ్లాదేశ్లోని మండి తెగలో ఇందుకు భిన్నమైన సంప్రదాయం ఉంది. ఈడొచ్చిన కూతురిని కన్న తండ్రే పెళ్లి చేసుకోవడం ఈ తెగ ఆచారం. అయితే బంగ్లాదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతాల్లో నివశించే ప్రాచీన తెగల్లో మండి తెగ ఒకటి.
ఎన్నో ఏళ్లుగా ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండటం గమనించవచ్చు. కన్న కుమార్తెను తండ్రే పెళ్లి చేసుకునే పద్దతి కూడా ఇందులో ఒకటి. ఈ క్రమంలో ఊహ తెలియని వయసులోనే అమ్మాయిలకు తమ తండ్రులతో వివాహం చేసినా, 15 యేళ్లనేళ్ళు నిండిన తర్వాత కాపురం చేయిస్తారట. ఇలా ఈ తెగలో తల్లీబిడ్డలిద్దరికీ భర్త ఒక్కరే ఉంటారన్నమాట.

ఒకవేళ భర్త చనిపోతే అదే తెగకు చెందిన ఓ వ్యక్తి ముందు తల్లిని పెళ్లి చేసుకోవడం, ఆమె సంతానాన్ని తమ సొంత పిల్లలుగా చూసుకోవడం ఈ తెగ వాసుల ఆచారం. ఇక ఈ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే సవతి తండ్రిని పెళ్లి చేసుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఈ మాట వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ మండి తెగ ప్రజలు మాత్రం ప్రాచీన కాలం నుంచే పాటిస్తున్నట్టుగా అక్కడి వారు చెబుతున్నారు.