ఆ స్టార్ నటుడు చేతిలో దారుణంగా మోసపోయిన ముమైత్ ఖాన్. ఇప్పుడు ఎలా ఉందంటే..?

భారతీయ సినీ నటి ముమైత్ ఖాన్. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.కొన్ని సినిమాలలో కీలక పాత్రలో నటించగా మరికొన్ని సినిమాలలో అతిధి పాత్రల్లో ఐటమ్ గర్ల్ గా నటించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, ఒడియా భాషలలో చాలా సినిమాలలో నటించింది.వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నది. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించి అందర్నీ ఫిదా చేసింది.

ఈ సినిమాతోనే టాలీవుడ్ కి తొలిసారిగా పరిచయం అయింది. ముమైత్ ఖాన్ కి ఒక ఫంక్షన్ లో ఆలీ సోదరుడు కయ్యూం పరిచయమయ్యారట.. దీంతో వీరి మధ్య మంచి అభిప్రాయం రావడంతో వీరిద్దరూ చాలా రోజులపాటు డేట్ చేశారట.. వీరిద్దరూ వివాహం చేసుకుందామనుకుంటున్న సమయంలో వీరి వివాహానికి సైతం ఇద్దరు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారట. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బ్రేక్ అప్ మొదలయ్యిందట. ఆ వెంటనే కయ్యూం వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

అయితే ముమైత్ ఖాన్ మాత్రం ఇప్పటికి ఒంటరిగానే జీవిస్తోంది. ఒకప్పుడు అందరూ స్టార్ హీరోలతో స్పెషల్ సాంగులలో నటించిన ముమైత్ ఖాన్ ఆ మధ్య డ్రగ్స్ తీసుకొందనే వార్తలు కూడా వినిపించాయి.. ఆ తర్వాత సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసుని మూసి వేయడం కూడా జరిగింది.అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దాదాపుగా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారందరికీ కూడా అవకాశాలు తెలుగు ఇండస్ట్రీలో చాలానే తగ్గిపోయాయని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *