జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు – పవన్‌లు నిలబడ్డారని అన్నారు. గతంలో రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ సూచన చేశారని..
మరిప్పుడు కాపులకు జగన్ రాజ్యాధికారం ఇస్తానన్నారా.. ముద్రగడ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడొకలా ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహరించడం దారుణమన్నారు. ముద్రగడ వైసీపీ కోవర్ట్ అని కాపులకు తెలిసిందన్నారు.
పోలీసులు – పరాధాలు లేకుండా బయటికి రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి కాలికి బలపం కట్టుకుని తిరుగుతుందని.. ముందు ఆమెకు సమాధానం చెప్పాలి జగన్ అని వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.