మృణాల్ ఠాకూర్ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. తన గురించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. అయితే, మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.
రకరకాల అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. అంత ఫిట్ గా ఉండేందుకు మృణాల్ జిమ్ లో ఎంతగానో శ్రమిస్తుంటుంది. అయితే సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ఆడియన్స్ ని పలకరించిన మృణాల్.. మరో తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే, నెట్టింట మృణాల్ కి సంబంధించిన జిమ్ వీడియో వైరల్ గా మారింది. తన అందచెందాలతో ఆకట్టుకునే మృణాల్ ఠాకూర్.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ బాడీ ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. అయితే ఈ వర్క్ అవుట్స్ చేయడానికి మృణాల్ జిమ్ లో ఇష్టం లేకుండా కష్ట పడుతున్నారు.
జిమ్ ట్రైనర్ మృణాల్ ని దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. అయితే జిమ్ ట్రైనర్ చూడని సమయంలో వర్క్ అవుట్స్ ఆపేసి రిలాక్స్ అవుతున్న మృణాల్.. ట్రైనర్ రాగానే వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు ఫుల్ కవరింగ్ ఇస్తున్నారు.