కృతి కర్బంద ఒక భారతదేశ సినీ నటి. తెలుగుతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించింది. సుమంత్ సరసన బోణీ తెలుగు చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటోంది. అటు బాలీవుడ్ లోనూ రెండేళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు. అయితే, తెలుగు, హిందీలో కంటే.. ఈ బ్యూటీ కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది. తన నటనతో అక్కడి ఆడియెన్స్ ను అలరించింది.
తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే, కన్నడలో ఓ సినిమా చేస్తుండగా తనకు ఎదురైన ఓ ఘటనను తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కృతి కర్బందా మాట్లాడుతూ.. ‘నేను ఓ కన్నడ మూవీ షూటింగ్ చేస్తున్నాను. నాకు ఓ హోటల్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడే పనిచేసే ఓ వ్యక్తి నా రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టారు. స్టే చేసే రూమ్ ను చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్ కు అలవాటు. అలా నా గదిని మొత్తం పరిశీలించగా.. సెటప్ బాక్స్ వెనకాల కెమెరా గుర్తించాం. అది చూసి షాక్ అయ్యాం.
అప్పటి నుంచి ఇంకెక్కడైనా బస చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను’. అని చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాలపై మక్కువ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇలా అనుభవం కలగడం బాధాకరమని అంటున్నారు. నటి కర్బందా ప్రస్తుతం సినిమాల జోరు పెద్దగా లేదు. బాలీవుడ్ లోనే సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ చివరిగా ‘14 ఫేరే’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమా అప్డేట్స్ లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తోంది. ఇక కర్బందా 2019 నుంచి నటుడు పుల్కిత్ సామ్రాట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.