పెళ్లయి ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకోబోతున్న మౌనిక రెడ్డి.

మౌనిక రెడ్డి గత ఏడాది గోవాలో ఎన్నో రోజుల నుండి ప్రేమించిన సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇక పెళ్లయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరమీద వినిపిస్తోంది. అయితే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి మౌనిక రెడ్డి. సూర్య లాంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె భీమ్లా నాయక్ సినిమాతో సినిమాల్లో కూడా బాగానే పేరుతెచ్చుకుంది.ఒకపక్క సినిమాలో నటిస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ మౌనిక బిజీగా మారింది. ఇక ఈ అమ్మడు గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే.

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సందీప్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఆ తరువాత అతనితోనే గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంది. ఆ పెళ్లి టైం లో మౌనిక చేసిన రచ్చ అంతాఇంతా కాదు. 28 ఏళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని ఎంతో ఎక్సైజ్మెంట్ ఫీల్ అవుతూ ఆమె చేసిన హడావిడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి అమ్మాయి తమ పెళ్లి అప్పుడు ఇలానే ఉండాలని, ఆమెను చూసి తాము కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.

అయితే ఆ పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. సంవత్సరం కూడా తిరక్కముందే ఆమె బంధం బీటలు వారిందని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా మౌనిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది. అంతేకాకుండా తన భర్తను అన్ ఫాలో చేయడంతో ఆమె విడాకులు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఈ సెలబ్రిటీలకి చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయిందని, ఏడాది గడవకముందే విభేదాలు,

విడాకులు తీసుకోవడం ఏమాత్రం బాగోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు గానీ మౌనిక రెడ్డిని మాత్రం అభిమానులు ఏకిపారేస్తున్నారు. పెళ్లిలో అంత రచ్చ చేసి ఇప్పుడు కనీసం ఏడాది కూడా గడవకముందే ఇలా విడాకులు ఇవ్వడం, భర్త నుంచి విడిపోవడం ఏమాత్రం బాగోలేదని చెప్పుకొస్తున్నారు. మరి మౌనిక విడాకులు తీసుకుందో లేదో అమ్మడే క్లారిటీ ఇస్తే బావుండు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *