మా అమ్మకు ఆ అలవాటు పోవాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త వేరియంట్‌ల బెదిరింపుల దృష్ట్యా, దాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యాక్సిన్‌లను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఏడాది క్రితం నాన్నకు కరోనా వచ్చి తగ్గిపోయింది. అప్పట్నుంచి అమ్మలో భయం పెరిగింది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి కడుగుతూనే ఉంటుంది. గిన్నెలు, కూరగాయలు, చేతులు పదే పదే కడుగుతుంటుంది. మేము ఎంతగా వద్దని చెబుతోన్నా వినడం లేదు.

అమ్మ ప్రవర్తన వల్ల ఇంట్లో అందరం ఇబ్బంది పడుతున్నాం. అమ్మకు ఈ అలవాటు పోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. – ఓ సోదరి. జ.. మీ అమ్మగారికి ఉన్న సమస్య ఈ రోజుల్లో చాలామందికి ఉంది. ఇది ఒక మానసిక రుగ్మత. అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్ (OCD) అంటుంటారు. ఇలాంటివారికి ఏదో ఒక ఆలోచన పదే పదే మైండ్‌లో తిరుగుతుంటుంది. దానివల్ల కంగారు, గాబరా పెరుగుతుంటుంది. దీని ప్రభావం ఎక్కువగా శుభ్రత మీద ఉంటుంది.

ఏది ముట్టుకున్నా వ్యాధులు వస్తాయేమోనని పదే పదే చేతులు కడుక్కోవడం.. శుభ్రంగా లేదని చేసిన పనినే పదే పదే చేయడం.. ఏ పనైనా పూర్తి చేయడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకోవడం ఇందులో భాగమే. కొంతమందిలో ఇది శ్రుతి మించిపోతుంది. ఇలాంటి ఆలోచనలు చాలావరకు వారి ప్రమేయం లేకుండానే వస్తుంటాయి. కాబట్టి, మీ అమ్మగారిని ఒకసారి సైకియాట్రిస్ట్‌ వద్దకు తీసుకెళ్లండి. వారు మందులతో పాటు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తారు. ఈ రెండిటి వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *