ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఉన్న జగపతిబాబు కెరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఒక దశలో ఆయన చేతిలో చిల్లిగవ్వ లేదు చేయడానికి సినిమాలు లేవు. దానికి తోడు అప్పులు. ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగపతిబాబుకు ఈ పరిస్థితి రావడానికి వ్యసనాలే అన్న ప్రచారం జరిగింది.అయితే గతంలో పలుమార్లు జగపతి బాబు స్వయంగా తన డబ్బు పోగొట్టుకున్నాను అని తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు దీనిపై స్పందిస్తూ..
నాకు క్యాసినో, గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. దాని వల్ల చాలానే డబ్బు పోగొట్టుకున్నాను. ఇక కొంతమంది నాకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. నా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఫ్యామిలీ కోసం ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టాను. ఇలా నా డబ్బు అంతా పోయింది. మొత్తం ఒకేదాంట్లో పోలేదు, నా అజాగ్రత్త వల్లే పోయింది అని తెలిపాడు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. నాకు రెండు ఫోన్స్ ఉండేవి. ఆ ఫోన్స్ పట్టుకొని ఉండేవాడిని ఎప్పుడూ ఎవరన్నా కాల్ చేసి అవకాశాలు ఇస్తారేమో అని చూసేవాడిని.
నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ వస్తే బాగుండు పోయిన డబ్బంతా సంపాదించాలి అనుకున్న. కనీసం ఒక 30 కోట్లు సంపాదిస్తే చాలు, నా ఫ్యామిలీ అంతా జీవితాంతం కూర్చొని అన్ని ఖర్చులతో బతికేస్తాం అనుకున్నాను. ఎలాగో లెజెండ్ సినిమా నా కెరీర్ ని మార్చేసి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్న 30 కోట్లు సంపాదించేసాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వస్తుంది. అది బోనస్. ప్రస్తుతానికి ఎలాంటి ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాను అని తెలిపాడు.