ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో భక్తవత్సలం నాయుడు అనే పేరు ఉంటే ఇండస్ట్రీలో రాణించడు అని ఎవరో చెప్తే విని స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు ఈయన పేరుని search మోహన్ బాబు గా మార్చేశారు. అయితే కెరీర్ లో ఎదిగే క్రమంలో కొన్ని విషాదాలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. వాటిలో భార్య మరణం ఒకటి. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి ఆత్మహత్య చేసుకొని మరణించారు. విద్యాదేవి ఆత్మహత్యకు కారణం ఏమిటో కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు స్వయంగా తెలియజేశారు. పరిశ్రమలో నిలదొకుక్కోకుండానే మోహన్ బాబు వివాహం చేసుకున్నారు.
భార్య విద్యాదేవితో చెన్నైలో కాపురం పెట్టారు. అడపాదడపా అవకాశాలు, చాలీచాలని సంపాదనతో మోహన్ బాబు దంపతులు ఇక్కట్లు పడేవారట. ఓ రోజు ఇంటి అద్దె చెల్లించలేదని ఓనర్… సామానులు బయటకు విసిరేసి తినే పాత్రలో మూత్రం పోసాడట. అప్పుడు ఇంట్లోకి వెళ్లి మోహన్ బాబు, విద్యాదేవి ఏడ్చుకున్నారట. ఆ కసితో నటుడిగా ఎదగాలని మోహన్ బాబు మరింత కష్టపడేవారట. ఎక్కువ సినిమాల్లో నటించే క్రమంలో సరిగా ఇంటికి వచ్చేవాడు కాదట. ఆ సమయంలోనే విద్యాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
భార్యాపిల్లలను మోహన్ బాబు కనీసం పట్టించుకోవడం లేదనే అసహనం విద్యాదేవిలో పెరిగిపోయిందట. ఒకరోజు క్షణికావేశంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి మంచు లక్ష్మీ, విష్ణు చిన్నపిల్లలు. విద్యాదేవి మరణంతో పిల్లలు అనాధలు అవుతారని మోహన్ బాబుకు నచ్చజెప్పి దాసరి నారాయణరావు రెండో వివాహం చేశారట. వేరే అమ్మాయి వస్తే తన పిల్లల్ని సరిగా చూసుకుంటుందో లేదో అన్న అనుమానంతో విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. నిర్మలా దేవికి మంచు మనోజ్ పుట్టాడు.
అక్క పిల్లలు కావడంతో మంచు విష్ణు, లక్ష్మీలను సొంత బిడ్డల వలె నిర్మలా దేవి పెంచి పెద్దవాళ్ళను చేశారు. ముగ్గురు పిల్లలు ఇద్దరు తల్లులకు పుట్టినవారని తెలిసింది చాలా తక్కువ మందికే. మోహన్ బాబు పిల్లల మధ్య అనుబంధం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనోజ్ కి విడాకులైనప్పుడు విష్ణు, లక్ష్మి అతనికి మోరల్ సప్పోర్ట్ ఇచ్చారు.