శనివారం రోజున ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో మాట్లాడారు మోహన్ బాబు. ఈ సమయంలో అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం అందిన వెళ్లలేకపోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు. “ఫిలీం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలీం నగర్‌లోని దైవ సన్నిదానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలీం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఫిల్మ్ నగర్‌లో దైవ సన్నిధానం దేవాలయాన్ని అందరి కోసం నిర్మించాం” అని మోహన్ బాబు పేర్కొన్నారు.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పలువురు హీరోలకు ఈ ఆహ్వానం అందింది. ఇప్పటికే రామ్ చరణ్ చిరంజీవి ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీకి అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదన్న సందేహాలు అందరికీ వ్యక్తం అయ్యాయి ఈ విషయం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ తమ కుటుంబానికి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిందని తెలియజేశారు.
రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందడమే కాకుండా తమకు సెక్యూరిటీ కూడా కల్పిస్తామని తెలియజేశారు కానీ భయం వల్లే మేము అయోధ్యకు వెళ్లడం లేదు అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయోధ్య వెళ్ళకపోయినా ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము అంటూ మోహన్ బాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.