మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి పొందేందుకు ధరలను ఐఓసీ పెంచింది. తాజాగా ఆ ధరలను ఐఓసీ తగ్గించింది. అయితే ఇండియన్ ఆయిల్ ద్వీపం కోసం ఇంధనాలపై అదనపు పన్నులు విధించింది. కవరత్తి, మినికైలో మౌలిక సదుపాయాలపై ఖర్చును తిరిగి పొందేందుకు ఈ పన్నులు విధించబడ్డాయి.
ఇక్కడ ఇంధనానికి డిమాండ్ చాలా తక్కువగా ఉండటం, మారుమూల దీవులకు రవాణా చేయడానికి ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఈ పన్నులు కూడా విధింపు ఉంది. గత మూడేళ్లలో లీటరుకు రూ.6.9 చొప్పున పన్ను వసూలు చేశారు. ఇప్పుడు ఖర్చులు పూర్తిగా రికవరీ అయినందున, పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఈ పన్ను తీసివేస్తోంది. అన్ని దీవులలో ధరను సమం చేయడానికి లీటరుకు రూ.7.6 మార్జిన్ ఇప్పటికీ అందుబాటులో ఉందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15.30 తగ్గాయి.
అదే సమయంలో కవరత్తి, మినికాయ్ దీవులలో ధరలు 5.2 రూపాయలు తగ్గాయి. కవరత్తి, మినీకాయ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.94 నుంచి రూ.100.75కి తగ్గింది.ఆండ్రోట్, కల్పేనిలో లీటరు ధర రూ.116.13 నుంచి రూ.100.75కి తగ్గింది. అలాగే కవరత్తి, మినీకాయ్‌లో లీటరు డీజిల్ ధర రూ.110.91 నుంచి రూ.95.71కి, ఆండ్రోట్, కల్పేనిలో లీటర్ రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గాయి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, లక్షద్వీప్‌లో పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు గురించి మాట్లాడుతూ..
లక్షద్వీప్ ప్రజలను తన కుటుంబంగా భావించిన మొదటి నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లక్షద్వీప్‌లోని కవరత్తి, మినీకాయ్, ఆండ్రోట్ మరియు కల్పేని అనే నాలుగు దీవులకు IOCL పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.