మెగాస్టార్ సినిమాల్లోకి వచ్చి ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మరో రెండు రోజుల్లో 68 యేళ్లు పూర్తి చేసుకుంటారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా తనదైన డాన్సులతో నటనతో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు కుర్ర హీరోలకు ధీటుగా తన డాన్స్. ఫైట్స్‌తో అలరిస్తూనే ఉన్నారు. అయితే 1955 ఆగస్టు 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ జన్మించిన విషయం తెలిసిందే. 1978 నుంచి నటుడిగా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పటికీ 150కి పైగా సినిమాలు చేశారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. నటనారంగంలో సంచలనంగా మారారు.

ఇంతటీ సక్సెస్ ను చూసిన చిరంజీవి ఎన్ని కోట్లు కూడబెట్టారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. సినిమాలు, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. అంజనా ప్రొడక్షన్ హౌజ్ ద్వారా చిరు ఆస్తులు కూడబెట్టారు. చిరుకు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే. అందులో సకల సౌకర్యాలు ఉండేలా నిర్మించుకున్నారు. దాని విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అలాగే కోట్లు విలువ చేసే ఫామ్‌హౌస్ కూడా బెంగళూరులో ఉంది. అదే విధంగా చిరంజీవి దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

ఖరీదైన ఆటోమొబైల్స్ కలెక్షన్స్ విషయానికొస్తే.. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9-10.5 కోట్లు), రేంజ్ రోవర్ (రూ. 4 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (సుమారు రూ. 2.2 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (రూ. 2 కోట్లు)తో పాటు ఆస్టన్ మార్టిన్ v8 వాన్టేజ్ కూడా ఉంది. అదేవిధంగా చిరు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా కలిగి ఉన్నారు. ఇక చిరు పలు వ్యాపారాల ద్వారా కూడా ఇన్ కమ్ కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇలా మొత్తంగా చిరంజీవి ఆస్తుల విలువ రూ.1,650కోట్లు ఉంటుందని అంటున్నారు. చిరు సంపాదించడంతో పాటు ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’, తదితర కార్యక్రమాలతో ప్రజా సేవ కూడా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా వ్యాపారాల ద్వారా కోట్లల్లో సంపాదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *