చిరంజీవి అనే వ్యక్తి, తన 30సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పణంగా పెట్టి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. వాస్తవానికి చిరంజీవికి 2009 లో పార్టీని స్థాపించడం అంత ఇష్టం లేదు. దీనికన్నా 2014లో రాజకీయపార్టీని స్థాపించి ప్రజల లోకి వెళ్ళాలి అనేది చిరు భావన. కానీ కొందరు మేథావులు, అశావహులు , స్వార్థపరులు మరియు మీడియా అథిపతులు తమ స్వార్ధ ప్రయోజాల కోసం చిరు చుట్టూ చేరడం మొదలు పెట్టారు.
వారు ఏవరో నేను చెప్పనక్కర్లేదు అనుకొంటా. రాజశేఖరరెడ్డి దెబ్బకి ఒక వర్గం అర్థిక మూలాలు పూర్తిగా కుదైలానాయి. అలానే చంద్రబాబు ప్రతిష్ఠ కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టవేయబడింది. ఈ ఆందోళనతోనే ఆ మేధావులు, ఒక వర్గపు మీడియా అధిపతులు, చిరు చుట్టూ చేరడం మొదలు పెట్టారు.
2014 పరిస్థితి ఎలా ఉంటుందో ఏవరు చెబుతారు? 2009 లోనే మీరు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలి అని చెవిలో ఇల్లు కట్టుకోని మరీ చెప్పడం మొదలు పెట్టారు. కావాలంటే మేథావులను, రాజకీయ నిపుణులను తాము పంపిస్తామనే ప్రతిపాదన కూడా జరిగింది. అలా వచ్చిన వాడిలో పరలోకం పరంగాడు ఒకడు. అతను ఎవరి మనిషో కూడా మీకు తెలిసిందే.