మీరా జాస్మిన్ జాతీయ పురస్కారం అందుకున్న భారతీయ సినీ నటి. విజయవంతమైన పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది. అయితే మీరా జాస్మిన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించింది మీరా జాస్మిన్. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ వీలైనంత వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసింది ఈ భామ.
అయితే సినిమాల నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెచ్చిపోతుంది.అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా నేటి జనరేషన్ హీరోయిన్లు కూడా పరేషాన్ అయ్యేలా అందాల ఆరబోతలో దూసుకుపోతుంది మీరా. 40ల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉన్నట్టుండి హాట్ షోకు తెరతీసింది మీరా జాస్మిన్. అసలు ఈమెలో ఈ రేంజ్ మార్పు ఎందుకు వచ్చింది అని అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం హోమ్లిగా కనిపించి.. రిటైర్ అయిన తర్వాత రెచ్చిపోతుండడానికి అసలు కారణం ఏంటబ్బా అని అందరూ పరేషాన్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఉంది అని తెలుస్తోంది.
మీరా ప్రస్తుతం తెలుగు కంటే మిగిలిన భాషలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. మరీ ముఖ్యంగా తన సొంత ఇండస్ట్రీ అయిన మలయాళంలో వరస సినిమాలు చేస్తుంది. కాకపోతే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి.. ఈమె కేవలం బయట మాత్రమే గ్లామర్ షో చేస్తుంది.. సినిమాల్లోకి వచ్చేసరికి చాలా పద్ధతిగా కనిపిస్తోంది మీరా. ఈ లెక్కలు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ.. బయట మాత్రం రెచ్చిపోవడం వెనక అసలు అర్థం ఏంటబ్బా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.