ఆ స్టార్ హీరోతో రెండో నటి మీనా పెళ్లి, పెళ్లిపై మీనా ఏమన్నారంటే..?

మీనా భర్త చనిపోయిన తర్వాత సోషల్‌ మీడియాలో ఆమెపై బోలెడు పుకార్ల వ్యాప్తి జరుగుతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఆమెపై సోషల్‌ మీడియా దాడి తగ్గడం లేదు. కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న ధనుష్ మీనాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలు తమిళ నాట బాగా వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి వార్తలు చూసి తన ఫ్యామిలీ చాలా బాధపడుతుందని మీనా చాలా సార్లు చెప్పింది. అయినా, మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాతో పాటు మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొంత మంది పనీపాటా లేని వాళ్లు సోషల్ మీడియాలో పుకార్లను ప్రచారం చేస్తున్నారని మీనా మండిపడ్డారు. “డబ్బు కోసం కొంత మంది ఎంతకైనా దిగజారడానికి వెనుకాడటం లేదు.

సోషల్ మీడియాతో పాటు మీడియా కూడా రోజు రోజు దిగజారిపోతోంది. వాస్తవాలు తెలుసుకోకుండా, ఏది నచ్చితే అది రాసేస్తున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాస్తే మంచిది. దేశంలో నా మాదిరిగా ఒంటరిగా జీవించే మహిళలలు ఎంతో మంది ఉన్నారు. మీరు నా గురించి ఎలా అనుకుంటున్నారో? వారి గురించి గురించి కూడా ఇలాగే ఆలోచిస్తారు.

మా కుటుంబ సభ్యులు, పిల్లలు ఈ వార్తలు చూసి బాధ పడుతారేమోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి రాస్తే మంచిది. ప్రస్తుతం నేను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు. భవిష్యత్తులో ఆ ఆలోచన ఉంటే తప్పకుండా అందరికీ చెప్తాను. అప్పటి వరకు ఎలాంటి పుకార్లు రాయకండి” అని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మీనా సినిమాలతో పాటు బుల్లితెరపై జడ్జిగా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *