మంత్రి ఆర్కేరోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన కామెంట్స్ ను ఖండించారు సినీ నటి మీనా. రోజా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అనీ..అలాంటి చీప్ కామెంట్స్ తో తన క్యారెక్టర్ ను దెబ్బతీయాలనకుంటే అది అవని పని అన్నారు మీనా.
అయితే తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు కోపం తెప్పిస్తున్నాయని అన్నది. ఓ మహిళ జీవితంలో పైకి ఎదుగుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతారా పబ్లిక్ గా అంటూ దుయ్యబట్టింది. మీరు కించపరిచేలా మాట్లాడితే ఏడుస్తూ కూర్చుంటారు అనుకుంటున్నారా తగిన బుద్ది చెప్తారంటూ ఫైర్ అయ్యింది నటి మీనా.
బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని అన్నది. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది.