అనుష్క శెట్టి కంటే వయసులో చిన్న వారైన కొందరు అందాల భామలు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. ఏడు అడుగులు వేసిన తర్వాత కూడా యాక్టింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కథానాయికలకు పెళ్లి ఎంత మాత్రం అడ్డంకి కాదు. అయితే అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడితో వివాహం అన్నారు. ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు. రెండో వివాహంగా అనుష్కను చేసుకుంటారనే వాదనలు తెరపైకి వచ్చాయి.
అవి కూడా వీగిపోయాయి. అనుష్క పెళ్లి వచ్చిన కథనాలు పుకార్లు గానే మిగిలిపోయాయి. మరోవైపు ఆమె వయసు 40 దాటేసింది. దీంతో అసలు వివాహం చేసుకుంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. వీటికి అనుష్క స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన వచ్చింది. ”నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు. వివాహ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది.
అనుష్క పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతుందని ఆందోళన చెందిన అభిమానులకు ఆమె కామెంట్స్ సంతోషపెట్టాయి. ఇక అరుంధతి, భాగమతి చిత్రాల్లో చేసిన పాత్రలు తనకు ఎంతో ఇష్టం అని, అలాగే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో చేసిన అన్విత పాత్ర కూడా అంత ఇష్టం అని ఆమె వెల్లడించారు. అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తుందని అన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న విడుదల కానుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు.