ఇదేం ట్విస్ట్. పల్లవి ప్రశాంత్ కు పెళ్లి అయ్యిందా..? భార్య ఎవరో తెలుసా..?

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెట్ పల్లవి ప్రశాంత్ కి పెళ్లయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ గా మారింది. దీంతో అతను నిజంగానే పెళ్ళి చేసుకున్నాడా..? ఆ ఫోటోలో అమ్మాయి అతని భార్యేనా..? అనే సందేహం జనాల్లో మొదలైంది. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్ అయ్యారు పల్లవి ప్రశాంత్. దీంతో అభిమానుల్లో ఈయనపై ఉన్న చెడు అభిప్రాయం తొలిగిపోయి పాజిటివ్ కు వచ్చింది. తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ లు ఇచ్చినా.. మళ్లీ నిలదొక్కుకున్నాడు. అంతే కాదు ప్రశాంత్ ఆట మీద నాగార్జున కూడా సంతృప్తిగా ఉన్నట్టే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అమ్మాయిలతో పులిహోర కలిపిన ప్రశాంత్ కు పెళ్లి అయిందనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. దీంతో ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో పల్లవి ప్రశాంత్ భార్యతో పాటు కనిపిస్తున్నాడు. పెళ్లి బట్టల్లో వధువు పక్కన మెరిసిపోతున్నారు. అరె పల్లవి ప్రశాంత్ కి ఎప్పుడు పెళ్లయింది. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదని పలువురు వాపోతున్నారు. ఇటీవల పల్లవి ప్రశాంత్ తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మేము కోటీశ్వరులమని వస్తున్న వార్తల్లో నిజం లేదు.

పల్లవి ప్రశాంత్ మంచివాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేస్తాం… అని ఆయన అన్నారు. కొడుకు బిగ్ బాస్ కోసం అబద్దం చెప్పినా తండ్రి అయితే చెప్పరు కదా.. మరి తండ్రి తన బిడ్డకు పెళ్లి చేస్తాం అనరు. అలాంటిది ఈ ఫోటోకు, తన తండ్రి మాటలకు సింక్ అవక ప్రశాంత్ అభిమానులు తలగోక్కుంటున్నారట. అయితే ఇది కేవలం మార్ఫింగ్ ఫోటో కావచ్చు. లేదా ప్రమోషన్స్, షార్ట్ ఫిల్మ్ వంటి వాటికోసం దిగిన ఫోటోలు కావచ్చు అనే సందేహాలు వెలువడుతున్నాయి. మరి చూడాలి ఇందులో నిజం ఎంత అనేది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *