ఆ దోష పరిహారం కోసం పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఏం చేసారో తెలుసా..?

లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జాతకంలో దోషం ఉందని ఆ దోష పరిహారం చేయాలి అంటే వినాయకుడి పూజ తప్పనిసరిగా చేయాలి అంటే పంతులుగారు నాగబాబుకు తెలియజేశారట. దీంతో నాగబాబు తన కూతురి జీవితంలా కొడుకు జీవితం కాకూడదని ముందుగానే కొడుకు కోడలి చేత వినాయకుడి పూజ చేయించారని తెలుస్తుంది. అయితే వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలు పాల్గొనబోతున్నారు అంటూ వరుణ్ తేజ్ తెలియజేశారు.

అయితే తమ పెళ్ళి ఎప్పుడు ఎక్కడ అనే విషయాల గురించి ఇంకా డిసైడ్ కాలేదని త్వరలోనే ఆ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తామని తెలిపారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి పనులలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ లావణ్య జాతకం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి జాతకంలో దోషం ఉందని ఆ దోషం తొలగిపోతే వీరి కాపురం బాగుంటుందని పండితులు వీరి జాతకం చూసి చెప్పారట

అయితే ఆ దోష పరిహారం తొలగిపోవాలి అంటే ఇద్దరు చేత వినాయకుడి పూజ చేయించడం ఎంతో అవసరమని చెప్పడంతో నాగబాబు వినాయక చవితి రోజునే వినాయకుడి పూజ చేయించారని తెలుస్తుంది. అందుకోసమే నాగబాబు తన ఇంట్లోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి చేత వినాయకుడి పూజ చేయించి దోష పరిహారం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ కారణం చేతనే లావణ్య పెళ్లికి ముందే తన అత్తగారి ఇంట్లో ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *