గతంలో బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. దాంతో రతిక బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అని అర్ధమవుతుంది. చాలా మంది రతిక మాజీ లవర్ రాహుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో సాంగ్స్ పాడక ముందు రాహుల్ ప్రయివేట్ ఆల్బమ్స్ చేశారు. ఆ సమయంలో రతికతో పరిచయం ఏర్పడిందని..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. గతంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
వారు ఆ ఇంటర్వ్యూలో తమపై వచ్చిన ఆరోపణలు 60 ఎకరాల పొలం, బంగ్లా, నాలుగు కార్లు ఉన్నాయని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అబద్దాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటుగా పల్లవి ప్రశాంత్ పెళ్లి గురించి కూడా ఈ సందర్భంగా హింట్ ఇచ్చారు. ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఇక ఇప్పుడు అతడు బిగ్ బాస్ విన్నర్ గా బయటికి రావడంతో..
త్వరలోనే ప్రశాంత్ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయం అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై ఇంతవరకు ప్రశాంత్ తల్లిదండ్రులు గానీ, ప్రశాంత్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. సంబంధాలు చూసే పనిలో ఉన్నారట ప్రశాంత్ తల్లిదండ్రులు. తమ చుట్టాల అమ్మాయినే అతడికిచ్చి వివాహం చేయడానికి చూస్తున్నట్లు సమాచారం. కానీ ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరావట్లేదు.