ఆ అమ్మాయితో మా అబ్బాయి పెళ్లి ఫిక్స్, పెళ్లి ఎప్పుడో తెలుసా..?

ఆది.. ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. మొత్తంగా ఈ షోతో ఆది సెన్సేషన్‌గా మారిపోయాడు. అయితే జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

మొదటగా స్క్రిప్ట్ రైటర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఇక తన కామెడీతో టీం లీడర్ గా మంచి స్థాయికి ఎదిగాడు. తన కామెడీ టైమింగ్, పంచులతో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. ఇక హైపర్ ఆదికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

త్వరలోనే ఆది ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైపర్ ఆది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అమ్మాయి ఎవరనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఓ ప్రముఖ యాంకర్ తో ఆది కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఆ అమ్మాయి ఎంతగానో సహాయం చేసిందని చెప్పుకొచ్చాడు. అలా స్నేహంగా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారిందని… కొన్ని సంవత్సరాల నుండి మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని ఆది చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *