ఒడిశా రాష్ట్రంలో సోన్‌పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ కు మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లితో పెళ్లైయింది. అయితే జిల్లికి తన దూరుపు బంధువైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉంటుంది. పూర్తీ వివరాలోకి వెళ్తే మనసులు కలవక కొందరు, ఇగో ఫీలింగ్స్ తో కొందరు, బాధ్యత మరిచి మరికొందరు ఇలా చాలా జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. విడాకులు కావాలని కోరుతున్నాయి. మరికొందరు మాత్రం గతంలో తమను ప్రేమించిన వాడిని మరిచిపోలేక, ఇంకొందరు వివాహేతర సంబంధాల కారణంగా సహచరుల నుంచి విడిపోతున్నారు.
పిల్లలు ఉండి కూడా కొందరు తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. దీంతో పిల్లలు మానసికంగా కుంగి పోతున్నారు. అయితే ఒడిశాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. అయితే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది. ప్రియుడితో పారిపోయిన తన భార్యకు భర్త పెండ్లి చేశాడు. దగ్గరుండి మూడు ముళ్లు కట్టించాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశా రాష్ర్టంలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ్ కు జిల్లి అనే మహిళతో మూడేండ్ల క్రితం వివాహమైంది. అయితే దూరపు బంధువైన పరమేశ్వర్ తో ఆమెకు సంబంధం ఏర్పడింది.
గురువారం పరమేశ్వర్ తో కలిసి జిల్లి పారిపోయింది. ఎంత వెతికినా అచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి, వారిని పట్టుకున్నారు. ఇక పోలీసుల ముందు జిల్లి తాను పరమేశ్వర్ తో కలిసే ఉంటానని చెప్పింది. ఇక మాధవ్ కూడా వారిద్దరిని కలిపేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరికీ పెండ్లి చేశాడు. అందరూ మాధవ్ చర్యను చూసి ఆశ్చర్య పోయారు. అయితే మాధవ్ లాంటి వారు మగ జాతిలో ఉండడం అరుదు అని మరికొందరు అభిప్రాయపడ్డారు.