మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతున్న అమలాపాల్..! ముద్దుల్లో ముంచేస్తూ, వైరల్ వీడియో..!

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. అయితే హీరోయిన్ అమ‌లాపాల్ రెండో పెళ్లికి సిద్ధ‌మైంది. ప్రియుడు జ‌గ‌త్‌ దేశాయ్‌తో త్వ‌ర‌లోనే ఆమె ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ది. గురువారం అమ‌లాపాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పెళ్లిపై జ‌గ‌త్ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

అమ‌లాపాల్ బ‌ర్త్‌డేను ఓ రిసార్ట్‌లో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేశాడు జ‌గ‌త్ దేశాయ్‌. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ వీడియోలో డ్యాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులు వేసిన జ‌గ‌త్ దేశాయ్.. అమ‌లాపాల్‌ను ఇంప్రెస్ చేశాడు. ఆ త‌ర్వాత అమ‌లాపాల్‌కు రింగ్ ఇచ్చి ప్ర‌పోజ్ చేశాడు. అత‌డి ప్ర‌పోజ‌ల్‌కు అమ‌లాపాల్ ఓకే చెప్పింది. జ‌గ‌త్‌దేశాయ్‌కి లిప్ కిస్ ఇచ్చింది. ఈ వీడియోను ఉద్దేశించి నా రాణి ఓకే చెప్పింది. త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. హ్యాపీ బ‌ర్త్ డే మై ల‌వ్ అంటూ జ‌గ‌త్ దేశాయ్ పేర్కొన్నాడు.

జ‌గ‌త్ దేశాయ్ పోస్ట్‌తో చూస్తుంటే త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లిపీట‌లెక్క‌బోతుండ‌టం ఖాయంగానే క‌నిపిస్తోంది. జ‌గ‌త్ దేశాయ్ వ్యాపార‌వేత్త అని స‌మాచారం. స్నేహితుల ద్వారా జ‌గ‌త్ దేశాయ్‌తో అమ‌లాపాల్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు చెబుతోన్నారు. కాగా అమ‌లాపాల్‌కు ఇది రెండో వివాహం కావ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *