సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం. క్యాన్స‌ర్‌తో ప్ర‌ముఖ న‌టుడి మృతి

మిలింద్ సఫాయ్..‘ఆయ్ కుతే కే కర్తే’ సీరియ‌ల్ ద్వారా మిలింద్ సఫాయ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప‌లు చిత్రాల్లోనూ న‌టించారు. ‘మేకప్’, ‘థాంక్ యు విఠలా’, ‘పోస్టర్ బాయ్స్’, ‘చడీ లగే చమ్ చమ్’, ‘ప్రేమచి గోష్టా’, ‘టార్గెట్’, ‘బి పాజిటివ్’ వంటి సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మదిలో చెద‌ర‌ని ముద్ర వేశారు. అయితే ప్రముఖ మరాఠీ నటుడు క్యాన్సర్ తో కన్నుమూయడంతో మరాఠీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. నేటి ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయ్ కుతే కే కర్తే అనే సీరియల్ ద్వార మిలింద్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీరియల్స్ మాత్రమే కాకుండా.. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించాడు.

మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ లాంటి సినిమాలు ఆయనకు మంచిపేరును తెచ్చి పెట్టాయి. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఎంతో మంచి నటుడు అని.. ఆయన చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ అవార్డ్స్ పండుగ వేళ ఇలా జరగడం ఎంతో బాధాకరమని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *