సినీ ఇండస్ట్రీలో విషాదం, ఇంట్లో శవమై తేలిన స్టార్ నటుడు, దుర్వాస‌న రావ‌డంతో..!

రవీంద్ర మహాజన్ పుణెలోని తన నివాసంలో నివాసం ఉంటున్నారు, కానీ ప్లాట్ లో గత మూడు రోజుల నుండి బయటకు రాకుండా, సిబ్బందికి గానీ లేదా బంధువులకు గానీ చుట్టుపక్కల వారికి గానీ తెలియకుండా ఇంట్లోనే ఉండిపోయారట. కానీ ఈ రోజు ఇంటిలో నుండి దుర్గంధమైన వాసనా వస్తున్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు పూణే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పూర్తీ వివరాలోకి వెళ్తే ప్రముఖ మరాఠీ సినీ నటుడు రవీంద్ర మహాజనీ (77) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. పుణెలోని తలేగావ్‌ దభాడే సమీపంలోని అంబి గ్రామంలోని ప్లాట్‌లో ఆయన మృతదేహం లభించింది. కాగా రవీంద్ర మూడు రోజుల క్రితమే చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేదు. ఈక్రమంలోనే ఆయన ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వారు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో రవీంద్ర మృతదేహం కనిపించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు కూడా మూడు రోజుల క్రితమే రవీంద్ర మృతి చెంది ఉండవచ్చంటున్నారు. కాగా మరాఠీ సినిమాల్లో రవీంద్రకు మంచి గుర్తింపు ఉంది. 70-80ల మధ్య ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. రవీంద్రను మరాఠీ సినిమా ఇండస్ట్రీ వినోద్ ఖన్నా అని పిలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *