మందారం కొబ్బరి నూనెలో వేసి పట్టించండి. మీ జుట్టు పెరుగుదలకు జీవం పోస్తుందట..!

ఎర్రటి మందారం ఒకటి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది , గ్రే హెయిర్ సమస్యను ఆపుతుంది. జుట్టును నల్లగా చేసి అద్భుతమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. బట్టతల రాకుండా ఆపుతుంది. చుండ్రుతో పోరాడుతుంది. మురికిని వదిలించుకోవడానికి మీరు మీ తలకు జోడించే అన్ని రసాయనాలు దానిని మరింత దిగజార్చుతాయి. అందుకే అమ్మమ్మలు హెయిర్ కేర్ కోసం నేచురల్ హోం రెమెడీస్ వాడాలని ఎప్పుడూ పట్టుబడుతున్నారు. అయితే మందారం జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. మందారపువ్వులను కొబ్బరినూనెలో వేసి మరగించాలి.

తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పూలలోని సారమంతా దిగేలా గట్టిగా పిండేయాలి. ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలో వేసి వుంచి, తలకు రాసుకుంటే చుండ్రు అదుపులోకి వస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే గుప్పెడు గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో వేయాలి. పది నిమిషాలు ఉంచి వాటిని బయటికి తీసి పిండేసి ఆ నీటిని మాడుకు పట్టించాలి.

అరగంట తర్వాత ఆరనిచ్చి ఆపై తలస్నానం చేస్తే జుట్టు శుభ్రపడటంతో పాటు చుండ్రు మాయమవుతుంది. చుండ్రు సమస్య తరచూ వేధిస్తుంటే.. గోరింటాకు పొడి ఏడు చెంచాలు, నిమ్మరసం ఒక స్పూన్, కొద్దిగా కొబ్బరి పాలు, యూకలిప్టస్ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి ముప్పావు గంట పాటు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయగలిగితే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *