అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏఎన్నార్ శతజయంతి వేడుకకు మహేష్ బాబు, రామ్ చరణ్, జగపతిబాబు, మోహన్ బాబు, బ్రహ్మానందం, రాజమౌళి, జయసుధ, టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే సినీ రంగంలో సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన నట దిగ్గజం. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో అద్భుతంగా నటించి నటనకే భాష్యం చెప్పిన నటసామ్రాట్… ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు.
ఈ మహానటుడి శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహా నటుడు పద్మ విభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.