ఇటీవలి కాలంలో సీక్రెట్ కెమెరాలు అధునాతన టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈ సీక్రెట్ కెమెరా లను నేరాలను అరికట్టేందుకు లేదా నేరస్థులను పట్టుకొనేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం సీక్రెట్ కెమెరా లను పాడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. కాగా కొన్ని సినిమాల్లో ఏకంగా షాపింగ్ మాల్స్ లో డ్రెస్సింగ్ రూమ్ లో లేదా బాత్రూంలో కూడా సీక్రెట్ కెమెరాలను అమర్చడం సన్నివేశాలను చూస్తూ ఉంటాము.
కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇక ఇలాంటి సీక్రెట్ కెమెరా లకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆడపిల్లలు షాపింగ్ మాల్ కు వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.
హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది.. దుకాణంలో క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. ఏకంగా మహిళల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టాడు. అంతేకాదు ఆ బట్టల దుకాణానికి షాపింగ్ కోసం వచ్చిన కొంతమంది మహిళలు రహస్య చిత్రాలను కూడా సేకరించడం గమనార్హం. అయితే ఏడాది క్రితం నుంచి ఇది జరుగుతూ వస్తుంది.