గత కొంత కాలంగా వయోభార సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. లీలావతి కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించారు. అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, వీరితో పాటు సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్, బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్.. మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్‌లు కూడా చనిపోయారు.
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు రమారత్నం శంకరన్ చనిపోయారు. వయో భార సమస్యల కారణంగా 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విచారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. తమిళంలో ఈయన ఒరు ఖైదియిన్ డైరీ, పతిమూనామ్ నెంబర్ వీడు, అమరన్, చిన్న గౌండర్, సతి లీలావతి, కాదల్ కోట్టై, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

1999లో వచ్చిన అలగార్ సామి సినిమాలో చివరగా నటించారు. తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. శంకరన్ మృతిపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.