పూర్వం రోజుల్లో అందరూ పంచె కట్టుకునే వారు. కట్టుకున్న పంచె జారిపోకుండా దానిపై నుండి మొలతాడు కట్టుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో మొలతాడు స్థానాన్ని బెల్ట్ ఆక్రమించింది అని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలంటారు. మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగటాన్ని తెలియజేస్తుంది.
బిగుతుగా మారితే కొవ్వు పెరిగినట్లు, వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా సంకేతం. నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అధిక వేడికి గురయితే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు.
ఏదైమైనా హిందూ ధర్మంలో ఇలాంటి సాంప్రదాయాలు ఆచరించాలని ఉందని పెద్దలు చెబుతారు. కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. మొలతాడు కట్టుకోకపోతే నష్టమా అనే విషయం పక్కనపెడితే, కట్టుకోవడం ద్వారా కొన్ని రకాలుగా ప్రయోజనకరంగానే ఉంటుంది తప్పితే ఎలాంటి నష్టం లేదు. కాబట్టి మొలతాడు ధరించడం అనేది ఒకరి ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అది వారి వ్యక్తిగతం. అంతే!