మహేష్ బాబు ఇంట శుభకార్యం. త్వరలోనే సితారకు ఘనంగా..!

గత కొన్నాళ్లలో వరసగా అన్న, తల్లిదండ్రుల్ని కోల్పోయిన మహేశ్.. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇలాంటి టైంలో మహేశ్ ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుందని తెలుస్తోంది. ఇది మహేశ్ తల్లి చివరి కోరిక అని అంటున్నారు. మహేశ్‌బాబు పక్కా ఫ్యామిలీమ్యాన్. అయితే మహేష్ బాబు ఇంట ఓ శుభకార్యం జరగనుందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

మహేష్ బాబు అన్న రమేష్ బాబు, మహేష్ తల్లి ఇందిరా దేవి, అలాగే ఆయన నాన్న సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడంతో మహేష్ బాబు మానసిక వేదనను అనుభవించారు. ఇక ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధనుంచి కోలుకొని తన షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా మహేష్ ఇంట ఓ శుభకార్యం జరగనుందని తెలుస్తోంది. మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి చివరి కోరికగా సితారకు ఓణీల ఫంక్షన్ జరపనున్నారని తెలుస్తోంది. ఈ శుభకార్యాన్ని మహేశ్ చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశాడట.

ఈ వేడుకకు మహేష్ బాబు కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని మాస్ మాసాల ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *