చూడటానికి సింపుల్ గా ఉన్నా మహేష్ బాబు ధరించిన షర్ట్ ధర ఎంతో తెలుసా..?

మహేష్ బాబు ఎప్పటి లాగే చాలా సింపుల్ గా, కూల్ గా కనిపించారు.ఈ క్రమంలోనే మహేష్ వేసుకున్న మహేష్ బాబు ధరించిన దుస్తుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా ఎన్నో చర్చలు జరుగు. చూడడానికి ఎంతో సింపుల్ గా కనిపిస్తున్న కూడా మహేష్ వేసుకున్న దుస్తుల ధరలు ఏమాత్రం కూల్ కాదు. అయితే గుంటూరు కారం సినిమా చెప్పినట్లే సంక్రాంతికి విడుదల అవుతుందని వెల్లడించారు.

అలాగే సితార బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం సంతోషం అన్న ఆయన, తన సామాజిక సేవా కార్యక్రమాలు గురించి వెల్లడించారు. ఇక తనకు కూడా మొబైల్ వ్యసనంగా మారిందని. ఉదయాన్నే లేవగానే మొబైల్ చూస్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ కలిగిన చెక్స్ షర్ట్ ధరించారు. సింప్లీ సూపర్బ్ గా ఉన్న ఆ షర్ట్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. మహేష్ ధరించి ఆ షర్ట్ ధర ఎంతని గూగుల్ లో సెర్చ్ చేశారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ కి చెందిన ఆ షర్ట్ ధర రూ. 18 వేలు అని తెలిసింది. మహేష్ రేంజ్ కి అది సాధారణమే.

కానీ మనలాంటి వాళ్లకు చాలా ఎక్కువ. మధ్య తరగతి వాళ్ళైతే ఏడాదికి సరిపడా బట్టలు ఆ డబ్బుతో సమకూర్చుకుంటారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షెడ్యూల్ ఇటీవల మొదలైంది. రూ. 4 కోట్లతో ఓ సెట్ వేశారని సమాచారం. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మహేష్ రాజమౌళి మూవీతో బిజీ కానున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *