మహేష్ బాబు మేనల్లుడు చుడండి, అచ్చు గుద్దినట్టు మేనమామ పోలికలతో..?

హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడి పేరు చరిత్ మానస్. చిన్న కొడుకు పేరు దర్శన్. చరిత్ మానస్ మేనమామ మహేష్ పోలికలతో కనిపిస్తున్నాడు. కొన్నిరోజులుగా అతడికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. అయితే సుధీర్ బాబు తన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఏడుకొండలు వెళ్లారు.

తోటి భక్తులతో కలిసి సుధీర్ బాబు ఫ్యామిలీ ఆ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందుకు రాగా.. సుధీర్ బాబుకి మళ్ళీ చరిత్ సినీ ఎంట్రీ ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి బదులిస్తూ.. “ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించే అడుగుతున్నారు. ఇంకా రెండుమూడేళ్లు సమయం ఉంది. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు” అంటూ వెల్లడించారు.

కాగా మహేష్ వారసుడు గౌతమ్ ఎంట్రీకి మరో పదేళ్లు పడుతుందని నమ్రత తెలియజేసారు. సుధీర్ బాబు మాటలు బట్టి గౌతమ్ కంటే ముందే చరిత్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే తన రెండో కొడుకు దర్శన్ కూడా సినిమాలోకి వస్తాడని, వాడే కృష్ణ గారి ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తమ నెక్స్ట్ జెనరేషన్ గట్టిగానే ఉండబోతున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *