ఇక చాలు నీతో సంసారం, మహాలక్ష్మీ సంచలన నిర్ణయం.

తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ గత ఏడాదిన్నర కాలం నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం నుంచి రవీందర్‌ గురించిన ప్రతి వార్త వైరల్‌ అవుతోంది. డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను పెళ్లి చేసుకుందని తెగ ట్రోల్‌ చేశారు. అలాగే రవీందర్‌ను కూడా పలువురు బాడీ షేమింగ్‌ చేశారు. తాజాగా ఓ ఫ్రాడ్‌ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఇటీవల బెయిల్‌ మీద విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే దీంతో ఆమె రవీందర్ ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే అంటూ అంతా భావించి ట్రోల్ చేశారు. అయితే అందులో నిజం లేదని ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు మనసులు కలవడం వల్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఈ దంపతులు తెలిపారు. అయితే వీరి పెళ్లి పై అలాగే మహాలక్ష్మి పై మరో నటి జయశ్రీ సంచలన కామెంట్లు చేసింది. ‘మహాలక్ష్మికి నా భర్తతో ఎఫైర్ ఉంది.

అందుకే మహాలక్ష్మీ మొదటి భర్త ఆమెను వదిలేశాడు. నా భర్త నా ముందే మహాలక్ష్మీకి వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అలాగే ఆమె కొడుకు నా భర్తను నాన్న అని పిలుస్తున్నాడు అంటూ జయశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది.’ ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఇది పాత వీడియో. ఈ వార్తలపై మహాలక్ష్మి స్పందించి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *