పెళ్లి అయినప్పటినుంచి మహాలక్ష్మి, రవీందర్‌ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. కొందరు నెటిజన్లు రవీందర్‌ను బాడీ షేమింగ్ చేస్తూ నెట్టింట పోస్టులు షేర్ చేశారు. అలాగే డబ్బు కోసమే మహాలక్ష్మి చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకుందంటూ విమర్శలు గుప్పించారు. అయితే కొన్ని రోజుల క్రితమే రవీందర్ జైలు పాలు అయ్యాడు. ఒక చీటింగ్ కేసులో రవీంద్రన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యర్దాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించాడంటూ..
చెన్నెలోని ఒక వ్యక్తి రవీందర్ పై కేసు పెట్టాడు. ఆ కేసు విషయంలో రవీంద్రన్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక మహాలక్ష్మీ వచ్చాకే ఇలా జరిగిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇకఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా మహాలక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ఆమెపై మరింత విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. ఫొటోల్లో ఎటువంటి అశ్లీలత లేదు కానీ.. ఆమె ఫోటోలను షేర్ చేయడమే తప్పు అని చెప్పుకొస్తున్నారు. చీరకట్టులో మహాలక్ష్మీ హాట్ గానే కనిపిస్తుంది. అంతేకాకుండా నవ్వులు చిందిస్తూ కూడా కనిపించడంతో నెటిజన్స్ అనుమానాలకు దారితీసింది.
భర్త జైల్లో ఉంటే .. ఏ భార్య.. ఇలా అలంకరించుకొని నవ్వుతు .. హాట్ గా ఫోటోలకు పోజులిస్తుంది. అందరు అంటున్నట్లే.. మహాలక్ష్మీ.. రవీంద్రన్ ను డబ్బుకోసమే పెళ్లి చేసుకొని ఉంటుంది. కొంపతీసి ఈమె భర్తను జైలుకు పంపిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి.. ఇలా ఫోటోలు దిగి పోస్ట్ చేయటానికి సిగ్గులేదు..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.