సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని నటి మాధవీ లత చెప్పుకొచ్చింది. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఫర్వాలేదని చెప్పింది. హీరోయిన్ అనే కాదు, ఏ పాత్ర చేయడానికైనా రెడీ అన్నది. కానీ, అమ్మాయి వ్యక్తిత్వ విలువలు తగ్గకుండా ఉండే క్యారెక్టర్ అయితేనే నటిస్తానని వెల్లడించింది.
అయితే సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన సమస్యలను ఎలా డీల్ చేశాననే విషయం గురించి కూడా మాధవీలత సదరు ఇంటర్వ్యూలో ఓపెన్‌గానే మాట్లాడింది. ‘‘నేను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోను. అయితే సహనం కోల్పోతే మాత్రం మాటలనేస్తాను. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మరు.
ఓ ప్రొడ్యూసర్ నాతో తప్పుగా మాట్లాడితే నేను అరిచేదాన్ని కాదు.. మీరనుకునే వ్యక్తిని నేను కాదండి అనే నెమ్మదిగా చెప్పేసేదాన్ని. ఆ రోజు వస్తావా అని అడిగినవాళ్లు తర్వాత రోజు నుంచి నన్ను అమ్మ అని పిలిచారు. నేను అలా ఉండేదాన్ని. ఇండస్ట్రీలో ఎక్కడా మనం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి.