భోళాశంకరుడిగా పిలవబడే శివుడ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే తప్పక కరుణిస్తాడు. ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్తే, ఏ పూజకు అయినా తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరిచి పూజ గదిని పరిశుభ్రం చేసుకోవాలి. అయితే శివ పురాణం ప్రకారం శివుడికి జమ్మి అంటే ఎంతో ఇష్టం. జమ్మి ఆకులతో శివలింగాన్ని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది భక్తుల సమస్యలన్నీ తొలగిపోతాయి. శని దోషం కూడా ఉండదు.
అదేవిధంగా బిల్వపత్రాన్ని సోమవారం శివుడికి సమర్పిస్తే కష్టాల నుండి గట్టెక్కొచ్చు శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. అదే విధంగా రావి ఆకులతో శివుడిని పూజిస్తే కష్టాల నుండి బయటపడొచ్చు అని పండితులు చెప్తున్నారు కాబట్టి శివుడిని ఆరాధించేటప్పుడు మీరు రావి ఆకులని కూడా ఉపయోగించవచ్చు. ఉమ్మెత్త ఆకులను కూడా శివుడికి పూజించడానికి వాడొచ్చు శివుడికి ఇది చాలా ఇష్టం.
ఈ ప్రీతికరమైనవి మీరు శివుడిని పూజించడానికి వాడితే కచ్చితంగా శివుడి కటాక్షం లభిస్తుంది. శివుడిని పూజించడానికి గంజాయి ఆకుల్ని కూడా సమర్పించవచ్చు ఇలా ఈ ఆకులతో శివుడికి పూజ చేస్తే సంతోషం కలుగుతుంది బాధల నుండి బయటపడవచ్చు. మీ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ఇలా బాధల నుండి బయటపడొచ్చు. కాబట్టి మీరు శివుడిని కొలిచేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి ఈ విధంగా శివుడిని ప్రార్థించి సమస్యల నుండి బయటపడండి.