23 జనవరి 1983న నారా లోకేశ్ జన్మించారు. ఆయనది భరణి నక్షత్రం మేష రాశి. భరణి శుక్ర నక్షత్రం. మిధున లగ్నం. లగ్నంలో రాహువు. జన్మ జాతక చక్రంలో శని ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ స్థానం కేంద్రం అయి ఉంటే శశ మహాపురుష యోగం ఏర్పడి ఉండిది. అయితే రాశి నుంచి కేంద్రంలో శని ఉన్నాడు కాబట్టి శశ మహాపురుష యోగం ఈయనకు వర్తిస్తుంది.
అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. అక్కడి నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితిపై లోకేష్ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు బాబుపై అవినీతి మరకలు పెట్టలేకపోయారని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రజలు, టీడీపీ నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కేసుకు సంబంధించి ఢిల్లీలోని లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు లోకేష్ తెలిపారు. కోర్టులో పోరాడుతూనే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.