ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్టో తెలియదు, నారా లోకేష్ మరో బాలయ్య కనిపిచ్చాడు.

యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు అందుకు సమాధనం చెప్పలేదు. నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు… కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా. అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ పోలీసులను నిలదీశారు.

అయితే పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద నారా లోకేష్‌ను రాజోలు సీఐ గోవిందరాజు అడ్డుకున్నారు. సీఐతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని చూసేందుకు వెళ్ళే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. దీంతో నేలపై బౌఠాయించి లోకేష్ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు హైడ్రామా చేస్తున్నారు.

అదేమని అడిగితే డీఎస్పీ వస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ వద్దకు కనీసం మీడియాను సైతం రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్టు చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్ళకూడదా అని పోలీసులను లోకేష్ నిలదీస్తే.. సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. తన వెంట నాయకులు ఎవరు రావడం లేదని… కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నానని.. అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *