సాక్షి పై కోపంతో లోకేష్ ఏం చేసాడో మీరే చుడండి.

లోకేష్‌ను ఓ వైపు సీఐడీ అధికారులు విచారిస్తుండగా మరోవైపు విచారణ అధికారులకు ఒక్కటే ఫోన్లు, మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొత్తం ఏడుసార్లు సీఐడీ అధికారులు బయటికి వెళ్లి ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సమాచారం. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్లే ఇక్కడ అధికారులు ప్రశ్నలు అడిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ యువనేత నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

శుక్రవారం సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో సమీక్షించేందుకు లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. 2వ రోజు టీడీపీ యువనేత నారా లోకేశ్‌ సీఐడీ విచారణ ముగిసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో లోకేశ్‌ను సీఐడీ విచారించింది. సీఐడీ అధికారులు నారా లోకేశ్‌ను 6 గంటలపాటు విచారించారు. “హైకోర్టు ఒక్క రోజే విచారించాలని చెప్పినా రెండో రోజు కూడా విచారణకు పిలిచారు.

సీఐడీ అడిగినందుకు రెండో రోజు హాజరయ్యా. ఈ రోజు 47 ప్రశ్నలు అడిగారు. సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారు. సీఐడీ కొత్తగా ఏమీ అడగలేదు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు. ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. 2 రోజుల పాటు నా సమయం వృథా చేశారు.” అని లోకేశ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *