నాగచైతన్య, సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు తిరగక ముందే చైతూ, సమంత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది. ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి అనగానే అందరికీ గుర్తొచ్చేవి సెలబ్రిటీల జాతకాలు. సినీ నటుల జాతకాలు పబ్లిక్ గా చెబుతూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి.
ఇటీవలి కాలంలో అయితే నెట్టింట ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణు స్వామి చాలా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్ను ఓడించలేరని ఆయన తెలిపారు. తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్య్వూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘటించారు.
దీనిపై యాంకర్ మాట్లాడుతూ… ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని.. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటూంటే మీరు… మీళ్లీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణు స్వామిని ప్రశ్నిస్తారు.