ఆహారం జీర్ణం చేయడానికి లివర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణం కావటానికి లివర్ సహాయపడుతుంది. ఐరన్, రాగి, విటమిన్ల వంటి వాటిని నిల్వ చేసుకుంటుంది. రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం చాలా అవసరం. అయితే లివర్‌ను శుభ్రం చేయడంలో పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి. 10 పుదీన ఆకులను తీసుకుని బాగా కడగాలి. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో ఈ ఆకులను వేసి బాగా మరిగించాలి. పది నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి గోరు వెచ్చగా అయిన తర్వాత తాగాలి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగాలి.
ఇలా చేయడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్లో ఉండే వ్యర్థ, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. అయితే ఈ పుదీనా రసాన్ని రోజూ తీసుకోవల్సిన అవసరం లేదు. వారానికి మూడు సార్లు తీసుకుంటే చాలు. ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్ సమస్యలు ఉన్న వారు ఆలివ్ ఆయిల్‌ను వాడడం మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. దీంతో లివర్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిత్యం ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివర్ శుభ్రమవుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలు తిన్నా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌ను సంరక్షిస్తాయి. లివర్ వ్యాధులు రాకుండా చూస్తాయి. వాల్‌నట్స్‌ను నిత్యం తినడం వల్ల కూడా లివర్‌ను శుభ్రపరుచుకోవచ్చు. వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌ను శుభ్రం చేస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. వెల్లుల్లిని నిత్యం తినడం వల్ల లివర్ శుభ్రమవుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లోని టాక్సిన్లను నాశనం చేసి బయటకు పంపుతాయి. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే లివర్ శుభ్రంగా మారుతుంది.