తమిళంలో వడివేలుకు జంటగా నటించి అక్కడా నవ్వుల రసాన్ని పంచింది. ఉత్తమ హాస్యనటిగా రెండు నందులు సహా అనేక అవార్డులు అందుకుంది. రాష్ట్రస్థాయిలోనూ బోలెడన్ని పురస్కారాలు అందుకున్న ఈ నటి తన జీవితంలో మాత్రం తోడు కావాలనుకోలేదు. ఆమెకు చిన్నతనంలోనే నటించే అవకాశం రావడంతో పాటు.. సాహసవంతమైన గర్బిణి పాత్ను పదోతరగతిలోనే నటించిందట కోవై సరళ. అంతే కాదు తన కుటంబం కోసం జీవితాన్నే త్యాగం చేసింది కోవై.
ముఖ్యంగా తన సోదరీమణులు ముగ్గురు ఆలన పాలన చూడటంతో పాటు.. వారి వివాహాలు చేసి.. ప్రస్తుతం మనవల్లు.. మనవరాల్ల ఆలన కూడా చూసుకుంటోంది కోవై సరల. తన కంటూ సొంత జీవితం లేక.. తన వారికోసమే బ్రతుకుతోంది. 61 ఏళ్లొచ్చినా ఒంటరిగానే..పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అఖండ విజయాలు కైవసం చేసుకున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద.. తన తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారు.
తను సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చుపెట్టేది. ఏనాడూ స్వార్థంగా ఆలోచించేది కాదు. అంతే కాదు మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన చెల్లెళ్ల కోసం అనునిత్యం ఆలోచింది తన జీవితాన్నే త్యాగం చేసింది. తను కూడా ఇల్లాలిగా మారాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కోవై సరళ వారి పిల్లలకు, మనవరాళ్ల ప్రేమగా చూసుకుంటోంది. ఒంటరిగా ఉండటం కూడా ఈ హాస్యనటికి ఇష్టమట. అందుకే వివాహం చేసుకోలేదట.
