మిస్టర్ అనే సినిమా షూట్లో ప్రేమలో పడిపోయిన ఈ జంట అప్పటినుంచి తమ ప్రేమాయణాన్ని సైలెంట్గా గుట్టుచప్పుడు కాకుండా రన్ చేస్తూ .. ఇన్నాళ్లకు ఓపన్ అప్ అయ్యారు. రీసెంట్ గానే నాగబాబు నివాసంలో నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట త్వరలోనే ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి పెళ్లి బాజా టైం దగ్గరికి రావడం జరుగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వీరిద్దరి జంట చూడముచ్చటగా కనిపిస్తోంది.
మెగా ఇంటి కోడలిగా అడుగుపెడుతున్న లావణ్య త్రిపాఠి కట్నం విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సెలబ్రిటీల పెళ్లి విషయం అనగానే ఎంగేజ్మెంట్ రింగ్ నుంచి వారు కట్టుకొనే బట్టలు అలాగే హ్యాండ్ బ్యాగులు అలాగే వాళ్ళ జువెలరీ ఇలాంటివన్నీ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటాయి. మెగా ఇంటికి కాబోయే కోడలికి వారి తల్లిదండ్రులు ఆమెకు ఇవ్వడంతో పాటు లావణ్య త్రిపాఠి సినిమాలలో సంపాదించిన ఆస్తిని అలాగే తనకు చేయించిన నగలను తమ ఆస్తిలో సగం భాగాన్ని లావణ్య త్రిపాఠి పేరు మీద కట్నంగా రాస్తామని లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు అన్నారట.
అయితే నాగబాబు మాత్రం మాకు ఎటువంటి కట్నం అవసరం లేదు. అంటూ బెట్టు చేశాడట. నాగబాబు గారు అలా అన్నప్పటికీ త్రిపాఠి పేరెంట్స్ మాత్రం మేము ఆస్తిని ఇస్తాము మా అమ్మాయి పేరు మీదే రాస్తాము అని అన్నారట. అంతేకాకుండా మేము ఇచ్చే ఈ చిన్న బహుమతిని కూడా మీరు కాదనకండి అంటూ బతిమాలారట. అయితే మీ అమ్మాయికి ఇచ్చే బహుమతులను ఆమె పేరిటే రాయండి మాకు మాత్రం కట్నం వద్దు అని మెగా ఫ్యామిలీ నాగబాబు చెప్పేసారట.