లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ ను రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా బంధువుల మధ్య, సినీ తారల మధ్య జరిగింది. అయితే ఇంతలోనే మెగా కోడలు లావణ్య గుడ్ న్యూస్ చెప్పడంతో.. అందరూ షాక్ అవుతున్నారు. అయితే మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తన సోదరుడికి పండంటి మగ బిడ్డ పుట్టాడని, నాకు మేనల్లుడు వచ్చాడని తన ఇన్ స్టా స్టోరీలో ఫొటోలు పంచుకుంది. త్రిపాఠి ఇంట్లోకి వారసుడు వచ్చాడని తెలిపింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక లావణ్య పెళ్లి తర్వాత ఆమె ఇంట్లో అన్ని శుభ పరిణామాలే జరుగుతూ వస్తున్నాయి. త్రిపాఠి వంశ పారంపర్యాన్ని నా మేనల్లుడు కొనసాగిస్తున్నాడు అంటూ డింపుల్స్(సొట్టలు) ఉండటం అనేది మా కుటుంబంలో కామన్ అని చెప్పకనే చెప్పుకొచ్చింది ఈ మెగా కోడలు. పండంటి మగ బిడ్డ రాకతో త్రిపాఠి ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వరుణ్-లావణ్యలు డెహ్రాడూన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. త్వరలోనే వరుణ్ తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టడానికి సిద్దమవుతున్నాడు.ఇక లావణ్య విషయానికి వస్తే, ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇందులో బిగ్ బాస్ అభిజిత్ కీలక పాత్ర పోషించాడు. అయితే పెళ్లి తర్వాత గతంలోలా వరుసగా మూవీలు చేస్తుందా? లేక వైవాహిక జీవితాన్ని ఆస్వాదించి.. తర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తుందా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.