సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక ఇచ్చింది. ఇందులో గాంధీ ఆస్పత్రి వైద్యులు కీలక వివరాలను పేర్కొన్నారు. ఆమె మృతికి గల కారణాలను వివరించారు. లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే మరణించారని వెల్లడించింది. డ్డు ప్రమాదంలో లాస్య నందిత తలకు బలమైన గాయాలు అయ్యాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
బలమైన గాయాలు కాడంతోనే స్పాట్‌లోనే చనిపోయినట్లు వెల్లడించారు. శరీరంలోనిఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. పక్కటెముకలు, తొడ ఎముకలతో పాటు ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. లాస్య నందితకు దగ్గరి బంధువైన పీయూష్ రాఘవ అలియాస్ ఛోటు ద్వారా ఆకాశ్.. ఎమ్మెల్యే వద్ద పనిలో చేరాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ సెలెక్షన్లలో ఉద్యోగం కోసం ఎంపికయ్యాడు. ఇతనితో ఎంపికైన వారికి ఇటీవలే కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమైంది.
తాను రెండో బ్యాచ్‌లో శిక్షణకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆకాశ్‌కు కారు డ్రైవింగ్ అంతంత మాత్రమే వచ్చని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడం, ఆ సమయంలో వేగాన్ని నియంత్రించలేకపోవడంతో యువ ఎమ్మెల్యే ప్రమాదంలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు.